రాజాకి దెబ్బేసిన రామ్..మ్యాజిక్ చేస్తున్న ‘ఉన్నది ఒక్కటే జిందగీ’..!

Sunday, October 29th, 2017, 10:45:26 PM IST

నేను శైలజ చిత్రం తరువాత దర్శకుడు కిషోర్ తిరుమల మ్యాజిక్ మరో మారు పనిచేసినట్లే కనిపిస్తోంది. రామ్ హీరోగా రూపొందించిన ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. అయినా కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3.6 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. రామ్ చిత్రాలలో బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రంగా ఉన్నది ఒక్కటే జిందగీని ట్రేడ్ అనలిస్టులు అభివర్ణిస్తున్నారు. కాగా ఈ చిత్ర జోరు శని, ఆదివారాలలో కూడా అదే స్థాయిలో కొనసాగుతుందని టాక్.

తొలి వారంలో జోరు చూపించిన రాజా ది గ్రేట్ చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ విడుదలయ్యాక డల్ అయింది. ఈ చిత్ర వసూళ్లు బాగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక రాజుగారి గది చిత్రం బయ్యర్లకు నష్టాలని మిగిల్చే దిశగా సాగుతోంది. భారీ హైప్ ఉన్న మారె చిత్రం దరిదాపుల్లో లేదు కనుక ఉన్నది ఒక్కటే జిందగీ టాక్ తో సంభందం లేకుండా మంచి వసూళ్లు సాచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments