మళ్ళీ ఓపెన్ థియేటర్స్ వస్తున్నాయోచ్ ?

Thursday, May 10th, 2018, 10:19:00 AM IST

ఓపెన్ థియేటర్స్ అంటే ఈ మధ్య కారుల్లో కూర్చొని దర్జాగా సినిమాలు చూసేలాంటిదే .. కానీ 80 వ దశకం, దానికి ముందు సినిమా థియేటర్స్ పెద్దగా ఉండేవి కావు .. ఈ విషయం ఆ సమయంలో పుట్టిన వాళ్లకు బాగా తెలుసు .. ఓ రోజు ఒక ఊరికి చొప్పున ఈ ఓపెన్ థియేటర్స్ లో సినిమా చూపించే వారు ..రాత్రివేళల్లోనే ఈ సినిమాలు ఆడేవి. ఒకటి, రెండు రూపాయలు వసూలు చేసి సినిమా ప్రదర్శన కానిచ్చేవారు. కానీ కాలం మారింది .. ఇప్పుడు మల్టిప్లెక్స్ , డిజిటల్ థియేటర్స్ లాంటి పరిజ్ఞానం వచ్చేసింది. సినిమా చూసే ప్రేక్షకులు మారుతున్నారు. పైగా ఇప్పుడు థియేటర్స్ లో సినిమా చూడాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ విషయం పక్కన పెడితే .. మళ్ళీ ఓపెన్ థియేటర్స్ పై ఆసక్తి పెరుతుగున్నట్టు తెలుస్తోంది. ఈ

తరహా థియేటర్స్ తో ప్రేక్షకులకు భారం కాకుండా ఉంటుంది. అందుకే తాజాగా ఈ ఓపెన్ థియేటర్ ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. బాలీవుడ్ నిర్మాత సతీష్ కౌశిక్, పారిశ్రామిక వేత్త సునీల్ చౌదరి కలిసి పిక్చర్ టైం పేరుతొ ఈ థియేటర్ ని అందుబాటులోకి తెచ్చారు. 150 – 200 మందివరకు చూసే వీలు ఉంటుంది. వర్షాలు .. అగ్నిప్రమాదాలు తట్టుకునేలా ఈ థియేటర్ ను రూపొందించారు. డిమాండ్ ను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్లి సినిమాలను ప్రదర్శిస్తారట. ఇందులో సినిమా ధరకూడా 30 నుండి 60 రూపాయల వరకు ఉంటుందని. ఈ థియేటర్స్ ని త్వరలోనే 150 కి పైగా రూపొందించే సన్నాహాలు చేస్తున్నారు.

Comments