అసెంబ్లీ సాక్షిగా ఇక వాడీ వేడి యుద్ధ‌మే!

Tuesday, June 11th, 2019, 10:55:45 PM IST

గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీ గ‌డ‌ప తొక్కింది. స‌మావేశాల్లో పాల్గొంది త‌క్కువే. అస‌లు అసెంబ్లీ గ‌డ‌పే తొక్క‌లేదాయ‌న‌. నిత్యం ప్ర‌జా క్షేత్రంలోనే వుంటూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికే అధిక ప్రాధాన్య‌త‌నిచ్చారు. అధికార ప‌క్షానికి భ‌య‌ప‌డి జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల‌కు రావ‌డం లేద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు అప్ప‌టి అధికార తెదేపా నాయుకులు జ‌గ‌న్‌ని ఎద్దేవా చేశారు. వారి మాట‌ల్ని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. అయితే ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన వైఎస్ జ‌గ‌న్, నారా చంద్ర‌బాబు మ‌ధ్య అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. అధికార ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్‌, ప్ర‌తి ప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబు నాయుడు క‌నిపించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ దాడులు ఎక్కువ‌య్యాయిని, ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కు ఇక నుంచి అండ‌గా వుంటామ‌ని, అందుకు టోల్ ఫ్రీ నంబ‌ర్‌ను ఏర్పాటు చేస్తున్నామంటూ చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించడం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ని అడ్డంపెట్టుకుని తేదేపా, గ‌డిచిన ఐదేళ్ల‌లో టీడీపీ అవినీతిని ఎండ‌గ‌ట్టాల‌ని వైసీపీ ఇప్పిటికే పెద్ద ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నాయి. వైఎస్ హ‌యాంలో ప్ర‌క‌టించిన ప్రాజెక్టుల్ని మేము పూర్తి చేశామ‌ని, అయితే ఇప్ప‌డు వాటిని ర‌ద్దు చేస్తూ కొత్త టెండ‌ర్లు పిలుస్తామంటున్నార‌ని చంద్ర‌బాబు స్వ‌రం పెంచారు. రేపటి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అసెంబ్లీలో వాడీ వేడీ చ‌ర్చ జ‌రిగి చిన్న పాటి యుద్ధ వాతావ‌ర‌ణం ఆవిష్కృత‌మ‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.