ఆస్ట్రేలియా గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న వసిం అక్రం

Thursday, August 22nd, 2013, 10:36:56 AM IST

Wasim-Akram
ఫాస్ట్ బౌలింగ్ లో స్వింగ్ వేసి అత్యధిక వికెట్లు తీసి బాగా ఫేమస్ అయిన ఫేమస్ పాకిస్థాన్ బౌలర్ వసిం అక్రం తన ఆస్త్రేలియన్ గర్ల్ ఫ్రెండ్ శనియెరా థామ్సన్ ని పెళ్లి చేసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించానని అనౌన్స్ చేసాడు. ఆ పెళ్ళికి సంబందించిన ఫోటోని మీరు పైన చూడొచ్చు. ‘ గత వారం లాహోర్ లో చాలా సింపుల్ గా శనేరియాని పెళ్లి చేసుకున్నాను. నాకు, నా భార్యకి, నా పిల్లలకి ఇదో కొత్త జీవితం అని’వసిం చెప్పాడు. వసిం అక్రం మొదటి భార్య హుమా 2009 లో తన శరీరంలోని అవయవాలు దెబ్బ తినడం వల్ల చనిపోయింది. వసిం అక్రం 30 సంవత్సరాలు కలిగిన శనేరియాకి కొద్ది రోజుల ముందు తన లవ్ ని ప్రపోజ్ చేసాడు. ఆమె అంగీకరించిన తర్వాత ఆగష్టు 12న వీరిద్దరూ అధికారికంగా వివాహం చేసుకున్నారు.