కుదిరిన అంగీకారం

Friday, September 19th, 2014, 04:52:20 AM IST


పులిచింతల ముంపు గ్రామాల ప్రజలను తరలించేవరకు ఆ ప్రాజెక్టులో నిటి నిల్వను 11 టీఎంసిల నుంచి 7.5 టీఎంసిలకు తగ్గిస్తామని..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ రోజు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సచివాలయంలో భేటీ అయ్యారు. పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తీ స్థాయిలో నింపడం వలన.. నల్గొండ జిల్లాలోని నాలుగు గ్రామాలు ముంపుకు గురయ్యాయని.. వారికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన నిధులను ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.