మంచి నీటిని ఇచ్చే చెట్ల గురించి ఎపుడైనా విన్నారా? అయితే ఇక్కడ చూడండి!

Wednesday, May 27th, 2020, 01:20:18 PM IST


అడవులలో, అక్కడక్కడ ఉండే నీటి చెట్లను మీరు ఎపుడైనా చూసారా? కనీసం వాటి గురించి విన్నారా? ఉప ఉష్ణ మండల అడవుల్లో కనిపించే టెర్మినాలియా తోమంటోసా చెట్టు నీటిని అందిస్తుంది. దాని బలమైన మొద్దు భాగంలో నీటిని అందిస్తుంది. అయితే దీనికి ఉన్న మరొక పేరు మొసలి బెరడు చెట్టు. అయితే ఇక్కడ కొంతమంది ఈ చెట్టు ద్వారా వస్తున్న నీటిని త్రాగడం మనం చూడవచ్చు. అయితే ఇలాంటి వాటి నీ పోస్ట్ చేస్తూ ఆకతాయిలను హెచ్చరిస్తున్నారు. ఇది ప్రకృతి సంపద అని, ఇలాంటి వాటిని నరకడం చట్టరీత్య నేరం అని కొందరు అంటున్నారు.

అయితే దీని గురించి సోషల్ మీడియా లో కంటే ఎక్కువగా ఇంటర్నెట్ లో వేతకాలి అని కోరుతున్నారు. ఏ చెట్టు ఎటువంటిదో పూర్తి గా తెలుసుకోవాలని, ఇలాంటి అరుదైన చెట్ల ను నరకివేయకుందా ఉండాలి అని వ్యాఖ్యానించారు. కొందరు మాత్రం ఇది నిజమా కాదా అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు అని, అందుకోసం వాటిని నరక వద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాక వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే వేరే మార్గాలు ఎంచుకోవాలి అని చెబుతున్నారు. ఇది ఎంతో మంది దహర్ది ను తీర్చే చెట్టు అని చెబుతున్నారు.