మేము అదృష్టవంతులం అంటున్న సూపర్ స్టార్ !

Sunday, May 13th, 2018, 05:14:59 PM IST

మనల్ని నవమాసాలు మోసి, కని, పెంచిన మాతృమూర్తికి మనము ఏమి చేసినా, ఎంత చేసిన ఆమె ఋణం తీర్చలేనిది. సృష్టి మనుగడకు మూలకారకులైన మాతృమూర్తిని నేడు స్మరించుకునే మాతృ దినోత్సవం నేడు. నిజానికి మాతృ దినోత్సవంగా ఒక్కరోజునే కేటాయించడం సరైనది కాదు అనేది చాలామంది వాదన. కాగా నేటి మాతృదినోత్సవం నాడు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ తల్లులతో కలిసి దిగిన ఫోటోలు, వారి చిన్ననాటి జ్ఞాపకాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ సంవత్సరం భరత్ అనే నేను తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు,

ఆయన తల్లి ఇందిరా దేవిని, భార్య నమ్రతను ఉద్దేశించి చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నేను, మా పిల్లలు గొప్ప తల్లులను కలిగివున్నందుకు పెట్టిపుట్టాము, వారికి అమితమైన ప్రేమను అందించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇటీవల తన చిత్రం భరత్ అనే నేను విడుదల రోజే తన తల్లి పుట్టిన రోజు కావడం తనకు పట్టలేనంత ఆనందంగా ఉందని, ఆ రోజున విడుదలయిన ఆ చిత్రం అద్భుత విజయం సాధించడం అమ్మ ఆశీస్సుల వల్ల జరిగిందని మహేష్ చెప్పిన విషయం తెలిసిందే……


image.png

Comments