మేమిద్దరం మంచి స్నేహితులం : రామ్ చరణ్

Monday, May 14th, 2018, 03:15:07 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలయి సూపర్ హిట్ అందుకున్న చిత్రం రంగస్థలం. గత చిత్రాలతో కొంచెం డీలా పడ్డ చరణ్ రంగస్థలంతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పటికే రూ.200 కోట్లు పైచిలుకు గ్రాస్ కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది. కాగా ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ భరత్ అనే నేను. బ్రహ్మోత్సవం, స్పైడర్ ల పరాజయాల తర్వాత మహేష్ బాబు మళ్లి ఈ చిత్రంతో లైంలైట్ లోకి వచ్చారు.

కేవలం మహేష్ అభిమానులేకాక సాధారణ ప్రేక్షకులు సైతం ఏఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు. విడుదలయిన మొదటిరోజునుండి మంచి కలెక్షన్లు సాధించిన ఏ సినిమా కూడా రూ.200 పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. అయినా ఇప్పటికీ స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించి టాలీవుడ్ కి మంచి కళ తీసుకువస్తే, వీరి అభిమానులు మాత్రం మా చిత్రం ఎక్కువంటే, మా చిత్రం ఎక్కువ అని సోషల్ మీడియా వేదికగా యుద్దమ్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై నిన్న ఒక జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చరణ్ మాట్లాడుతూ, నేను మహేష్ ఎప్పటినుండో మంచి స్నేహితులం.

మాలో ఎవరి సినిమాలు ఆడినా ఒకరినొకరు అభినందించుకుంటాం. అయినా భరత్ అనే నేను, రంగస్థలం రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం ఇద్దరికీ ఎన్నడూ లేనంత ఆనందాన్ని ఇచ్చిందని, అయినా ఎవరి చిత్రం ఎక్కువ కలెక్షన్లు సాధించింది అనే విషయమై తమ మధ్య చర్చలు ఉండవని ఆయన వెల్లడించారు. కొందరేమో మహేష్ చిత్రం విడుదలయినపుడే నేను కావాలని నా చిత్రాలను విడుదల చేస్తున్నారని నిందిస్తున్నారని, అసలు అవన్నీ కాకతాళీయంగా జరిగినవే తప్ప అటువంటి ఉద్దేశం తనకుల్ లేదన్నారు. ఏదిఏమైనా ఇలా విడుదలైన ప్రతి చిత్రం ఘనవిజయం సాధిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ కి మంచిదని, రాబోవు రోజుల్లో ఇక పై మంచి చిత్రాలు చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు……..

Comments