అందరు అబ్బాయిలను సోదరులుగా భావించలేము కదా! : నటి అనుష్క

Thursday, January 18th, 2018, 03:07:17 PM IST

నటి అనుష్క తన తాజా చిత్రం భాగమతి ప్రమోషన్ లో భాగం గా మీడియా వారితో మాట్లాడుతూ అన్న మాటలివని తెలుస్తోంది. నిజానికి చాలా రోజుల నుండి ప్రభాస్ కి అనుష్కకి మధ్య ఏదో ఉందని, వారిద్దరూ ప్రేమలో వున్నారనే వార్తలు చాలా కాలం నుండి వినిపిస్తున్నాయి. అవన్నీ నిజం కాదని వారిరువు కొట్టిపారేసినా సరే వస్తున్న పుకార్లు మాత్రం ఆగడం లేదు. విషయం లోకి వెళితే ఆమె మాట్లాడుతూ ‘ప్రభాస్ ని తన అన్నయ్య గా భావించి అలా పిలవలేనని, ఎందుకంటే తనతో మాట్లాడే ప్రతి అబ్బాయిని సోదరులుగా భావించలేము కదా’ అని కీలక వ్యాఖ్యలు చేశారట. నా గురించి బయట ఏమి ప్రచారం జరుగుతుందో తెలియదు, నేను వార్తా పత్రికలు కూడా చదవను అని ఆమె అన్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి గురించి తనకు ఎటువంటి ఆలోచన లేదని ఎవరైనా మంచి అబ్బాయిని చూస్తే చేసుకోవడానికి తాను సిద్ధమని అన్నారట. ప్రత్యేకంగా ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించనని, సమయం వచ్చినపుడు వాటంతట అవే జరిగిపోతుంటాయని ఆమె అన్నట్లు చెపుతున్నారు. బాహుబలి తర్వాత కొంత విశ్రాంతి కోసమే ఆమె తక్కువగా సినిమాలు ఒప్పుకున్నారని, రాజమౌళితో మరొకసారి తనకు పనిచేయాలని ఉందని ఆమె మనసులో మాట ఈ సందర్భంగా అన్నారట..