అలనాటి సినిమాలు ఇక కనపడవా…?

Thursday, November 10th, 2016, 02:46:35 PM IST

mayabazar
అది 1900 ల సంవత్సరం.. అప్పుడప్పుడే సినిమా ప్రపంచానికి పరిచయం అవుతున్న రోజులవి. సాంకేతిక విజ్ఞానం చాలా తక్కువ. అయినప్పటికీ ఒక సినిమా విడుదల అయిందంటే ప్రజల్లో విశేష ఆదరణ పొందేది. కథానాయకులు, నాయికలు సైతం చాలా తక్కువగా ఉండే ఆ రోజుల్లో వారి నటనకు ప్రేక్షక మహాశయులు ముగ్దులయ్యేవారు. ఒక సినిమా విడుదల అయిందంటే అది కనీసం ఆరు మాసాలైనా విజయవంతంగా ఆడేది. థియేటర్లు అంతగా సౌకర్యవంతంగా లేకపోయినా,
సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా తెరలు సైతం సరిగ్గా స్పష్టంగా కనబడకపోయినా సరే ఆ నాటి సినిమాలకు విశేష ఆదరణ లభించేది. అప్పుడు స్టూడియో ల అందుబాటు కూడా చాలా తక్కువే. వాటినే సర్ధుకొని సినిమాలు తీసేవారు. ఆ కాలంలో ఒక బొమ్మ పడిందంటే అది కొన్ని నెలలైనా గుర్తుడేది. కాని నేడు ఏ రోజున వచ్చిన సినిమాలు ఆ రోజునే వెళ్లిపోతున్నాయి. కథలో అర్థం ఉండదు. సన్నివేశానికి సంబంధం ఉండదు. కొన్ని సినిమాల కథలైతే సినిమా చుసిన వెంటనే మర్చిపోతున్నారు.

కథా నాయకుల, నాయికల సంఖ్య పెరగడం, సరైన కథా సారాంశం ఉన్న కథలు కరువవ్వడం, వీక్షకులకు ఏదైనా కొత్తగా కనబడాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉండడం, డైరెక్టర్లు వినూత్న పంథాలో సినిమాలు తీయడం అందులో కొన్నింటికి ప్రజల విశేష ఆదరణ లభించడం. మరికొన్నింటికీ ఆదరణ కరువవ్వడం ఇలా సినిమా పరిశ్రమ పది ఫ్లాప్ లు ఒక హిట్టు అన్న సూత్రంతో కొనసాగుతోంది. మన తెలుగు పరిశ్రమను తీసుకున్నట్లయితే, అలనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు మాత్రం తెలుగు ప్రజల విశేష అఆధరాభిమానాలు మాత్రం గెలుచుకున్నాయి.

ఒక 50 సంవత్సరాలు తెలుగు పరిశ్రమను పటిష్టమైన పునాదుల మీద నిలబెట్టారంటే ఆ క్రెడిట్ వారికే సొంతం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు సినీ పరిశ్రమ నేడు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందంటే దానికి కారణం ఈ తెలుగు పితామహులే అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నా, నాటి తరహా ఉమ్మడి కుటుంబ హాస్య భరిత సన్నివేశాలు గల కుటుంబ నేపథ్యం గల చిత్రాలు ఇక కనుమరుగేనా…?

అని ప్రశ్నించుకుంటే ఇక కనపడవనే చెప్పాలి. కారణం వీక్షకుల ఆలోచనలో వస్తున్న మార్పు. పెరిగిన పాశ్చాత్య ధోరణి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా అలనాటి సినిమాలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరనీయంగా నిలిచాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలనాడు సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అహర్నిశలు పాటుపడ్డ ప్రతో ఒక్కరికీ నేడు సినిమాల్లో రాణిస్తున్న వారంతా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా పరిశ్రమ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు ఇంత స్థాయికి చేరిందంటే దాని వెనకాల ఎందరో మహానుభావుల కృషి దాగి ఉందని మనం గ్రహించాలి.