జీవితరాజశేఖర్ మీద ఆధారాలు సిద్ధంగా వున్నాయి : సామజిక నేత సంధ్య

Wednesday, April 18th, 2018, 11:38:37 PM IST


కొద్ది రోజులక్రితం ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో శ్రీరెడ్డి చేస్తున్న కాస్టింగ్ కౌచ్ పోరాటం విషయమై సామాజిక కార్యకర్త సంధ్య మాట్లాడుతూ ,ప్రముఖ హీరో రాజశేఖర్ అలానే ఆయన సతీమణి జీవిత పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిన్న జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, అనవసరంగా తమను కొందరు కుట్రపన్ని ఇరికిస్తున్నారని, అటువంటి వారిని వదిలే ప్రసక్తిలేదని అన్నారు. అంతే కాదు అవతల ఎంతమంది ఉన్నప్పటికీ తాను మాత్రం ఒక్కదాన్నే వాళ్ళని ఎదుర్కోగలనని ఆమె అన్నారు. మరీ ముఖ్యంగా సంధ్య అనే కార్యకర్త తమ కుటుంబం మీద లేనిపోని నిందలేస్తోందని మండిపడ్డారు. సంధ్యను వదిలిపెట్టనని, నిరాధార ఆరోపణలు చేసిందని జీవిత అన్నారు. అయితే నేడు దానికి సంధ్య ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కి తాజాగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆధారాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు.

రాజశేఖర్‌ను పల్లెటూరు నుంచి వచ్చిన ఓ అమ్మాయి కలిసిన తీరుపై ఆమె స్పష్టంగా వివరించి చెప్పారు. నేను ప్రతి మంగళవారం, శుక్రవారం కౌన్సెలింగ్‌ ఇస్తాను. ఏడేళ్ల క్రితం ఇద్దరమ్మాయిలు నన్ను కలవడానికి వచ్చారు. ఓ లెటర్‌ కూడా రాసుకొచ్చి ఇచ్చారు. వారిద్దరూ ఒక ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అందులో ఒక అమ్మాయి పల్లెటూరి నుంచి వచ్చి, తన పాకెట్ మనీ కోసం ఎవరి ద్వారానో సినీనటుడు రాజశేఖర్‌ని కలిసింది. ఆమె ఒక కమిట్‌మెంట్‌లో ఉంది. అయితే, దానికి మధ్యలో డీల్‌ చేసేది జీవిత. అది క్యాస్టింగ్‌ కౌచ్ కాదు, డైరెక్టుగా డీలింగ్‌. ఆ అమ్మాయిని లైంగికంగా లొంగదీసుకోవడం. నాతో వారు ఇంకా చాలా చెప్పారు. వారిని మీడియా ముందుకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మీకు బాగా తెలుసు, ముప్పై ఏళ్లుగా నేను ఒక్కసారి కూడా బాధితులెవ్వరినీ మీడియా ముందుకు తీసుకురాలేదు.

ఆ అమ్మాయిలిద్దరినీ తీసుకొచ్చి వారి భవిష్యత్తుని దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి కజిన్ ప్రముఖ పత్రికలో పని చేస్తారు. ఆయనతో చెబుతామని, పేపర్లో వేయిద్దామని ఆ అమ్మాయిలు అన్నారు. అయితే ఆ పత్రిక ఆఫీసులో ఒకామెను కలవండని నేను చెప్పాను. రెండు, మూడు రోజుల్లోనే ఆ పత్రికలోని ఒక పేజీలో, ఆమె ఈ బాగోతమంతా పూర్తిగా ప్రచురించేలా చేశారు. అది అప్పుడు బయటకు తీసుకొచ్చి మళ్లీ చూపిస్తాం అని సంధ్య తాను చేసిన ఆరోపణలను నిరూపించుకుంటానని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ విషయమై ఆమె మాటలకు జీవిత స్పందించాల్సి వుంది…..

  •  
  •  
  •  
  •  

Comments