టీడీపీ ఎమ్మెల్యేలు : ఆ రెండు కోర్కెలు తీరిస్తే రాజీనామా చేస్తాం

Sunday, June 16th, 2019, 06:43:03 PM IST

“విలువలే రాజకీయాలకి ప్రధాన పెట్టుబడి” అంటూ అప్పట్లో కొందరు నేతలు చెప్పేవాళ్ళు, వాటిని పాటించేవాళ్ళు. ఒకే ఒక్క MP ని తమవైపు తిప్పుకుంటే ప్రధాని కుర్చీ నిలబడేది అని తెలిసిన కానీ, అలాంటి పనిచేయటానికి ఇష్టం లేక, ఏకంగా ప్రధాని పదవి వదులుకున్న వాజ్ పాయ్ లాంటి నేతలు పుట్టిన మన దేశంలో, నేడు చిన్న చిన్న వాటికే, తమ స్వలాభాల కోసమే పార్టీలు మారే నాయకులు తయారైయ్యారు. విలువలను తుంగలోతొక్కి, సంప్రదాయాలను సంకలో చుట్టేసి, చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాదు, యావత్తు భారతదేశంలో కూడా ఇలాంటి విష సంస్కృతీ ఎక్కువగా ఉంది.

ఇక ఆంధ్ర విషయానికి వస్తే దాదాపు 10 మంది తెలుగుదేశం MLA లు వైసీపీ లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ లిస్ట్ ఎవరనేది కూడా వైసీపీ అధినాయకత్వం దగ్గరకి చేరినట్లు తెలుస్తుంది. అయితే జగన్ మాత్రం పార్టీ ఫిరాయించాలంటే ఖచ్చితంగా స్పీకర్ పార్మెట్ లో రాజీనామా చేయాలనీ చెప్పాడు . దీనితో ఆలోచనలో పడిన టీడీపీ ఎమ్మెల్యేలు కొన్ని తర్జనలు,భర్జనలు పడిన తర్వాత రెండు ప్రధానమైన కండీషన్స్ జగన్ ముందు పెట్టినట్లు తెలుస్తుంది.

1. తాము రాజీనామా చేసి వచ్చిన తర్వాత, MLA గా పోటీచేసే ఛాన్స్ తమకే ఇవ్వాలి, ఒకవేళ కుదరని పక్షంలో తమ కుటుంబసభ్యులకి ఇవ్వాలి.
2. ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారు తప్పకుండా మా తరుపున మా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి.

వీటికి జగన్ నుండి హామీ లభిస్తే, వెంటనే అసెంబ్లీ రూల్స్ ప్రకారం స్పీకర్ పార్మెట్ లో రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నామని పార్టీ మారే ఆలోచనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తుంది.. మరి వాటికీ జగన్ ఆమోదముద్ర వేస్తాడో లేదో చూడాలి..