గణేష్ నిమజ్జనం కోసం వినాయక్ సాగర్‌

Wednesday, October 15th, 2014, 08:39:58 PM IST

ganesh-sagar
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. ఇక నుంచి హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాలని నిర్ణయించారు. సాగర్‌కు వచ్చే మురికి కాలువలన్నింటినీ దారి మళ్లించాలని అధికారులకు సూచించారు. హుస్సేన్‌సాగర్‌ను సీఎం పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌లోకి మురికి నీరు రాకుండా చూడాలని అధికారులను కోరారు.

ఇక వినాయక నిమజ్జనానికి కొత్త సరస్సును నిర్మించబోతోంది సర్కార్. ఇందిరా పార్క్ సమీపంలో 20 ఎకరాల స్థలంలో కొత్త సరస్సును నిర్మించబోతున్నారు. ఈ సరస్సుకు వినాయక సాగర్ అని పేరు పెట్టారు. హుస్సేన్‌సాగర్‌లోని నీటితో వినాయక్ సాగర్‌ను నింపుతారు. ఇక నుంచి గణేష్ నిమజ్జనం వినాయక సాగర్‌లోనే జరపాలని నిశ్చయించారు.