రజినీకాంత్ రెమ్యూనరేషన్ వింటే షాకవ్వాల్సిందే!

Thursday, May 3rd, 2018, 11:05:08 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కు కేవలం మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో వున్న క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరితోనూ పోల్చలేనిది అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలయిన కబాలి చిత్రం అందుకు కొంత సాక్ష్యం. అలానే ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న కాలా చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్ర సాటిలైట్ హక్కులను విజయ్ టివి అత్యధిక ధరకు ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరోప్రక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోందట. ఇక శంకర్ తీస్తున్న 2.0 అయితే చెప్పనవశర్మ లేదు, ఎంతైనా సరే మేము ఇచ్చి కొంతామ్ అని బయ్యర్లు రెడీ గా ఉన్నారట.

ఇక పోతే త్వరలో అయన సన్ పిక్చర్స్ పతాకంపై కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మొదలుకాబోయే ఆయన 165వ చిత్రానికి ఏకంగా రూ.65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట రజిని. ఇది మన దేశంలోనే ఒక హీరో తీసుకునే అత్యధిక రెమ్యూనరేషన్ అంటున్నారు. ఈ చిత్రంకోసం ఆయన 40 రోజుల కాల్ షీట్ ఇచ్చారని, చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలనీ సన్ పిక్చర్స్ సంస్థ భావిస్తోందట. కాగా ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రకు విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసిందట చిత్ర బృందం. కాగా రజిని నటించిన లేటెస్ట్ మూవీ కాలా త్వరలో చెన్నై లో ఘనంగా ఆడియో విడుదల జరుపుకుని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది……

  •  
  •  
  •  
  •  

Comments