ఆస్కార్ అకాడెమీ నుంచి బ‌హిష్క‌రించారు!

Monday, October 16th, 2017, 07:16:48 PM IST

ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 40 మంది క‌థానాయిక‌ల్ని లైంగికంగా వేదించిన దుర్మార్గుడిగా ప్ర‌ముఖ హాలీవుడ్ ఫిలింమేక‌ర్ వీన్‌స్టీన్ హార్వే పేరు మార్మోగిపోతోంది. పైశాచిక‌త్వానికి ప‌రాకాష్ట అత‌డు అంటూ క‌థానాయిక‌లంతా బ‌హిరంగ వేదిక‌ల సాక్షిగా విరుచుకుప‌డుతున్నారు. కేట్ విన్‌స్లెట్, ఏంజెలినా వంటి అంద‌గ‌త్తెలు ఇత‌గాడి వేదింపుల‌కు బాధితుల‌య్యారంటే అత‌డి స్థాయిని అంచ‌నా వేయొచ్చు. అంతెందుకు భార‌తీయ అంద‌గత్తె, మాజీ విశ్వ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్‌ని ఒంట‌రిగా క‌ల‌వాల‌ని మేనేజ‌ర్‌నే ఏమార్చే ప్ర‌య‌త్నం చేశాడు హార్వే.

ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో టాప్ హీరోయిన్స్ బ‌హిరంగ వేదిక‌ల‌పై వీన్‌స్టీన్ హార్వే లైంగిక వేదింపుల‌పై బ‌య‌టికే చెప్పుకుని ఆవేద‌న చెందారు. దీంతో అత‌డి పీటం క‌దిలిపోతోందిప్పుడు. నిన్న‌టివ‌ర‌కూ టాప్ ఫిలింమేక‌ర్‌గా గౌర‌వం అందుకున్న ఆయ‌న .. ప్ర‌స్తుతం ఆస్కార్ అకాడెమీ అవార్డుల క‌మిటీలో కీల‌క‌వ్య‌క్తిగా కొన సాగుతున్నారు. హార్వే తెర‌కెక్కించిన దాదాపు 300 సినిమాలు ఆస్కార్ బ‌రిలోకి వెళితే వాటిలో దాదాపు 81 సినిమాలు ఆస్కార్‌లు గెలుచుకున్నాయి. అంత‌టి దిగ్గ‌జం పేరు ప్ర‌ఖ్యాతుల‌పై వేదింపుల మ‌ర‌క అంటుకుంది. వ‌రుస మీడియా క‌థ‌నాల‌తో అకామెడీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్‌) వేదిక లో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. హుటాహుటీన ఓ స‌మావేశం ఏర్పాటు చేసి వీన్‌స్టీన్‌ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. నాలుగు వొంతుల్లో మూడొంతుల ఓట్ల‌తో అత‌డిని తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది ఆస్కార్ టీమ్‌. మొత్తానికి హార్వేకి ఇది ఊహించ‌ని ఝ‌ల‌క్ అనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments