వైజ‌యంతీ బ్యాన‌ర్‌ నుంచి `వెబ్‌సిరీస్`?

Wednesday, February 15th, 2017, 02:21:56 PM IST

ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ ట్రెండ్ న‌డుస్తోంది. దీంతో ప‌లు సంస్థ‌లు వెబ్‌సిరీస్‌ల‌పై దృష్టి సారిస్తున్నాయి. వ్యూయ‌ర్స్ ఆధారంగా .. ఆద‌ర‌ణ‌ను బట్టి ఆదాయం ఆర్జించే అవ‌కాశం ఉన్న వెబ్ సిరీస్ ఇటీవ‌లి కాలంలో బాగానే పాపుల‌రైంది. ఓవైపు పేరుకు పేరు, డ‌బ్బుకు డ‌బ్బు వ‌చ్చే ఛాన్సున్న ఐడియా ఇది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ప‌లు సినీనిర్మాణ‌ సంస్థ‌లు వెబ్ సిరీస్‌లు తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

ప్ర‌ఖ్యాత నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ సైతం వెబ్ సిరీస్‌ల రూప‌క‌ల్ప‌న‌కు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. నందిని రెడ్డి సార‌థ్యంలో ఈ వెబ్ సిరీస్‌లు ర‌న్ అవుతాయిట‌. ఇప్ప‌టికే కొత్త కుర్రాడు శ‌శాంక్ కి అవ‌కాశం ఇచ్చి ఎంకేరేజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే సెట్స్‌కెళ‌తార‌ని తెలుస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌,కృష్ణ‌, చిరంజీవి, చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ వంటి స్టార్ల‌తో సినిమాలు తీసిన వైజ‌యంతి మూవీస్ ఇటీవ‌లి కాలంలో సినిమాల ప‌రంగా జోరు త‌గ్గించినా, ఇలా ట్రెండ్‌ని ఫాలో చేస్తూ వెబ్ సిరీస్‌లు తెర‌కెక్కించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయ్యింది.