ఓరి .. వీడి తెలివి తగేలేయ్య .. మహేష్ ని ఇలా వాడాడా ?

Wednesday, May 2nd, 2018, 12:32:49 PM IST

ఈ మధ్య కొందరి క్రియేటివి చుస్తే పిచ్చి పీక్స్ కి వచ్చిందని అనిపిస్తుంది. ఎంత క్రియేటివిటీ ఉంటె మాత్రం .. దానికంటూ ఓ పద్దతి పాడు ఉంటాయి .. కానీ మరి సిగ్గు ఎగ్గూ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే జనాలు ఊరుకుంటారా !! ఈ మధ్య ఇలాంటి అరాచకాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఎక్కువగా వాడేస్తున్నారు. సరే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే .. తాజగా ఓ కొత్తగా పెళ్లయిన యువకుడు తన శోభనం రోజున ఫ్లెక్సి బ్యానర్ చేయించి తన ఇంటిముంది అలంకరించాడు .. పైగా ఆ ఫ్లెక్సీ లో అతను లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా భరత్ అనే నేను సినిమాను వాడుకోవడం విశేషం .. ఆ ఫ్లెక్సీ లో భరత్ ముఖ్యమంత్రి గా చేసిన ప్రమాణాన్ని .. ఇలా తన కోణంలో రాసుకున్నాడు.. మరి అతగాడి పైత్యం ఎలా ఉందొ .. పైన ఉన్న ఫోటో చదవండి !! అయితే ఈ విషయంలో అటు మహేష్ ఫాన్స్ కాస్త ఫైర్ మీదున్నారు.

Comments