భాగమతి తరువాత అనుష్క పరిస్థితి ?

Wednesday, January 24th, 2018, 03:04:44 PM IST


సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా స్టార్ హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో సంచలనం రేపడంలో అనుష్క స్టయిలే వేరు. ఆమె నటించిన పాత్రలు ఎప్పటికి ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. తాజాగా భాగమతి గా వస్తున్నా అనుష్క ఈ సినిమాతో సంచలనం రేపడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అనుష్క కెరీర్ లో అరుంధతి బిగ్గెస్ట్ హిట్ .. ఆ సినిమాను మించేలా భాగమతి ఉంటుందట. ఇక ఇప్పటికే భాగమతి తరువాత అనుష్క నెక్స్ట్ సినిమా ఏమిటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ విషయం పై ఈ అమ్మడు స్పందిస్తూ ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదని, బాగమతి తరువాత ఏ సినిమాకు కమిట్ కాలేదని చెప్పింది. అసలు ఏ సినిమాకు సంబందించినా కథ చర్చలు కూడా జరగడం లేదట !! మరి అనుష్క కావాలనే అవకాశాలను వద్దంటుందా, లేకపోతె పెళ్ళికి సిద్దమై ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.