చరణ్ నెక్స్ట్ టైటిల్ పై సర్వత్రా ఆసక్తి ?

Sunday, September 30th, 2018, 09:47:17 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం అజర్ బైజాన్ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయంట్ తెలిసిందే. ప్రస్తుతానికి అక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే సంక్రాంతి సందర్బంగా విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి సినిమా మొదలై ఇన్నాళ్లు కావొస్తున్నా కూడా ఈ సినిమా టైటిల్ ఖరారు చేయకపోవడం పై మెగా ఫాన్స్ గుస్సా మీదున్నారు. తాజాగా ఈ చిత్రానికి స్టేట్ రౌడీ, జగదేక వీరుడు అన్న టైటిల్స్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. అయితే ఈ టైటిల్ పెట్టె ఛాన్స్ లేదని .. బోయపాటి స్టైల్ లో ఈ సినిమాకు టైటిల్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అదే ఆలోచనలో ఉన్నారని, దసరా రోజున ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు మెగాస్టార్ సినిమా పేరు పెడతారా .. లేక మరో పేరు ఫైనల్ చేస్తారా అన్న దిశగా ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా .. ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది .