ఇలా అయితే బంగార్రాజుకు అడుగులు పడేనా ?

Sunday, May 27th, 2018, 01:51:06 PM IST

అక్కినేని నాగార్జున ను బంగార్రాజుగా సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఓ రేంజ్ లో చూపి సూపర్ హిట్ కొట్టేసిన కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష. ఆ తరువాత వెంటనే బంగార్రాజు టైటిల్ తో ఓ సినిమా చేయాలనీ అనుకున్నారు. కానీ వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో వేరే సినిమాలు చేసారు. ఇక కళ్యాణ్ కృష్ణ ఆ తరువాత రారండోయ్ వేడుక చూద్దాం .. లేటెస్ట్ గా నేల టికెట్ సినిమాలు చేసాడు .తాజగా రవితేజ తో చేసిన నేలటికెట్ ఇటీవలే విడుదలై భారీ పరాజయాన్ని అందుకోవడంతో కళ్యాణ్ కృష్ణ పరిస్థితి ఆలోచనలో పడింది. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ముందు నాగార్జునతో బంగార్రాజు సినిమా చేయాలనీ ప్లాన్ చేసారు. అయితే నేల టికెట్ ఫలితం తారుమారవడంతో ఇప్పుడు బంగార్రాజు ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సక్సె స్ లేకపోవడంతో నాగార్జున ఈ సినిమాకు ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments