ఎన్టీఆర్ బయోపిక్ పై క్లారిటీ ఇస్తారట ?

Saturday, May 26th, 2018, 06:16:02 PM IST

మహానటుడు అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవలే మొదలై దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. దాదాపు నెల గడుస్తున్నా కూడా ఈ సినిమా పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. తాజాగా సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సంచలన విజయం సాధించడంతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా పై ఆసక్తి ఎక్కువైంది. అటు నందమూరి అభిమానులు కూడా ఈ సినిమా పై పలు సందేహాలు వ్యక్తం చేయడంతో బాలయ్య ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తేజ తప్పుకోవడంతో ఆయాన ప్లేస్ లో పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా క్రిష్ ని రంగంలోకి దింపుతున్నారట. బాలయ్య తో కలిసి క్రిష్ చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ కావడంతో ఈ బాధ్యతను బాలయ్య క్రిష్ కె అప్పగించాడని అంటున్నారు. అయితే ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి రోజున ఈ సినిమా గురించి క్లారిటీ ఇస్తారట. చూద్దాం .. మరి ఆ రోజైన ఈ సినిమా పై క్లారిటీ వస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ !!

  •  
  •  
  •  
  •  

Comments