రామ్ .. వాటమ్మా .. వాట్ ఈజ్ నెక్స్ట్ అమ్మా ?

Tuesday, May 22nd, 2018, 09:49:08 AM IST

ఎనర్జిటిక్ హీరోగా మంచి క్రేజ్ట్ తెచ్చుకున్న హీరో రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉన్నది ఒకటే జిందగీ భారీ ప్లాప్ అందుకోవడంతో రామ్ ఆశలు నీరుగారిపోయాయి. దాంతో తన నెక్స్ట్ సినిమా విషయంలో సెలెక్టీవ్ గా ఎంపిక చేసుకున్న రామ్, రీసెంట్ గా గరుడావెగా లాంటి సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ మొదలు పెట్టింది కానీ బడ్జెట్ ఎక్కువ కావడంతో ఆ బ్యానర్ వెనక్కి తగ్గింది .. ? దాంతో రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లైన్ లోకి వచ్చింది. ఇక షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసారు .. ఇంతలో ఈ సినిమాకు అనుకున్నదానికంటే కూడా బడ్జెట్ భారీగా పెరగడంతో వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారట. ఈ సినిమాకు అంత బడ్జెట్ ఎక్కువని రామ్ కూడా భావించాడట. దాంతో ప్రయత్నాలు విరమించుకున్నట్టు తెలుస్తోంది. సో రామ్ నెక్స్ట్ సినిమా దాదాపు ఆగిపోయినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments