ఇంతకీ .. అమర్ అక్బర్ ఆంటోని ఏమయ్యారబ్బా ?

Tuesday, July 24th, 2018, 02:16:04 PM IST

మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. టీమ్ కూడా అమెరికా వెళ్ళింది .. అయితే దాదాపు నెల దాటుతున్నా కూడా ఈ సినిమాకు సంబందించిన ఒక్క న్యూస్ కూడా ఎక్కడ రావడం లేదు. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేక ఆపేశారా ? అన్న అనుమానాలు ఫిలిం వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వరుస పరాజయాలతో సతమతమైన రవితేజ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ సినిమాతో ముందుకొచ్చాడు.

ఆ సినిమా యావరేజ్ గా నిలవడం ఆ తరువాత చేసిన టచ్ చేసి చూడు, నేల టికెట్ సినిమాలు డాం అంటూ పరాజయాన్ని అందుకున్నాయి. దాంతో రవితేజ నెక్స్ట్ సినిమా పై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి . మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒకేసారి రవితేజ తో రెండు సినిమాలు ప్లాన్ చేసారు .. అందులో ఒకటి శ్రీను వైట్లతో కాగా , మరొకటి సంతోష్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసారు. అయితే రెండు సినిమాలు ఒకే హీరోతో అయితే రిస్క్ అని సంతోష్ శ్రీనివాస్ తమిళ్ తేరి రీమేక్ ని ఆపేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో తేరి రీమేక్ ని ఆపారా లేక .. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments