జై లవకుశ తేలిపోయింది… ఇక స్పైడర్ లెక్క ఏంటి?

Sunday, September 24th, 2017, 06:41:39 PM IST


జూనియర్ ఎన్టీఅర్ హీరోగా చేసిన జై లవకుశ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ సంపాదించుకుంది. మరో వైపు తారక్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ దిశగా దూసుకెల్తుంది. మరో రెండు రోజుల పాటు తారక్ హవాని ఆపే దమ్ము ఎవరికీ లేదు. షో తారక్ కెరియర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిపోవడం గ్యారెంటీ అనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇక జై లవకుశ లెక్కలు తేలిపోయాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో స్పైడర్ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. స్పైడర్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దాని తోడు ఫ్లాప్ లేని దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాని తెరకెక్కించడం మరో ఎత్తు. అతని మార్కెట్ కూడా ఆల్ ఇండియా లెవెల్. ఇక సూపర్ స్టార్ మహేశ్ క్రేజ్ కూడా సౌత్ ఇండియా మొత్తం ఉంది. ఈ నేపధ్యంలో స్పైడర్ సినిమా తెలుగు, తమిళ, మలయాళీ భాషలో ఒకే సారి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 150 కోట్లు వరకు అయ్యిందని వినికిడి, అలా చూస్తే సినిమా కచ్చితంగా భారీ హిట్ అయితేనే ఆ కలెక్షన్స్ క్రాస్ చేస్తుంది.

మహేశ్ – మురుగదాస్ రేంజ్ బట్టి చూస్తే సినిమా కచ్చితంగా 200 కోట్లు క్లబ్ లో కచ్చితంగా చేరుతుందని అందరు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు సినిమా మీద అంత హైప్ అయితే తెలుగునాట లేదు. ఉన్నంతలో మహేష్ క్రేజ్ మీద సినిమా బిజినెస్ అవుతుంది. దానికి తోడు ఈ సినిమా కంటెంట్ కూడా కాస్తా కొత్తగా హాలీవుడ్ తరహాలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో స్పైడర్ తో అటు డైరెక్టర్ ఇటు మహేశ్ తెలుగు ఫ్యాన్స్ ని ఎలా మెప్పిస్తారు అనేదాని మీద సినిమా హిట్ ఆధారపడి ఉంటుంది. సినిమా ఏమాత్రం అటు ఇటుగా ఉన్న మరల జూనియర్ దూసుకుపోవడం గ్యారెంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే జై లవకుశ సినిమా తో ఎన్టీఆర్ తన రేంజ్ ని పరిచయం చేసుకున్నాడు. ఇక స్పైడర్ సినిమాతో మహేశ్ ఎ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments