ఇంతకీ ఆ బయోపిక్ ఉన్నట్టా .. లేనట్టా ?

Monday, April 30th, 2018, 10:44:08 AM IST

ఈ మధ్య టాలీవుడ్ లో బయోపిక్ ల హవా బాగా పెరిగింది. ఇప్పటికే అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కుతుందో. దాంతో మాటు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్, మహానటి సావిత్రి బయోపిక్ లు జోరుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాంతో పాటు బ్యాట్మెంటన్ వీరుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలు జరిగాయి. సుధీర్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య ఈ సినిమా గురించి ఎక్కడ వినిపించడం లేదు. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గరుడ వేగా లాంటి హిట్ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు హీరో రామ్ తో సినిమా చేస్తున్నాడు. అంటే గోపీచంద్ బయోపిక్ అటకెక్కినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో హీరో సుధీర్ బాబు ట్రైనింగ్ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అయన వేరే సినిమాల్తో బిజీగా మారాడు. మొత్తంగా వ్యవహారాలన్నీ చూస్తుంటే .. ఈ బయోపిక్ ఇప్పట్లో తెరకెక్కే ప్రయత్నాలు కనిపించడం లేదు.

  •  
  •  
  •  
  •  

Comments