మంత్రి పదవి దక్కలేదనే ఇదంతా చేస్తున్నారా…?

Tuesday, September 10th, 2019, 02:31:54 AM IST

తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి జరిగినటువంటి మంత్రి వర్గ విస్తరణలో తమ కి మంత్రిగా అవకాశం వస్తుందని అనాధగా ఉన్నటువంటి నేతలకు కొందరికి భంగపాటు తప్పలేదు. కాగా ఆశించిన పదవులు రాని కొందరు మాత్రం తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. కాగా వారికి మంత్రి పదవులు రాకపోవడంతో కొందరు బహిరంగంగా తీవ్రమైన వాఖ్యలు చేస్తున్నారు. దానికితోడు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా కొందరు నేతలు మాత్రం వినూత్న స్థాయిలో నిరసనకు తెరలేపుతున్నారు. ఈమేరకు తెరాస కీలకనేత జోగు రామన్న స్వతహాగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలాగె మరొక నేత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా చేరిపోయారని వార్త.

అయితే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి కూడా, తనని కాదని, తనకంటే ఒక జూనియర్ కి అవకాశం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా చివరికి ఆయన తన గన్మెన్ లని వెనక్కి పంపించేశారు., తన ఆవేదనని అంతటిని కూడా తన సన్నిహితులవద్ద వెళ్లబోసుకుంటున్నారని సమాచారం. అయితే ఇలా ఒక్కొక్కరిగా మొదలై తీవ్రంగా మారుతున్నా ఏ నేతలను పార్టీ అధిష్టానం ఎలా చల్లబరుస్తుందో మరి…