“భరత్ అనే నేను” సెన్సార్ రిపోర్టు ఏంటంటే?

Monday, April 16th, 2018, 06:41:57 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వం వహించగా,డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20న విడుదల కాబోతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్‌లుక్ నుంచి ట్రైలర్ వరకూ విడుదలైన ప్రతిదీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. మంచి యాక్షన్, వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల సిద్ధం చేసిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలోను ఆసక్తి వుంది. ఈ సినిమాకి ముందు కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఘన విజయాలను సాధించాయి.

ఆ సక్సెస్ ల జాబితాలో ‘శ్రీమంతుడు’ కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో మహేశ్ వుంటే, ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆశతో కైరా అద్వాని వుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జీరో కట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. విడుదల తర్వాత ఈ సినిమా ఏ మేర విజయం అందుకుంటుందో చూడాలి మరి……