తనకు జరిగిన వేధింపుల విషయమై గాయని చిన్మయి ఏమన్నారంటే!!

Tuesday, March 13th, 2018, 08:44:41 PM IST


తనకు ఎదురైనా వేధింపుల ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెల్పుతూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్మయి గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. గతేడాది ఆమె న్యూయార్క్‌ వెళ్లినప్పుడు తన ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న కారు నుంచి కొన్ని వస్తువులు ఎవరో దొంగతనం చేశారని ఆమె వాపోయారు. విషయం ఏంటంటే ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన తనను ఓ వ్యక్తి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడట. ఈ జరిగిన విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ షేర్‌ చేశారు. అలానే నన్ను షాక్‌కు గురి చేసిన విషయం ఏంటంటే, చిన్నతనంలో ఎంత మంది లైంగిక వేధింపులకు గురై ఉంటారో. సొంత ఇంట్లో, బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు, విద్యా సంస్థల్లో వేధింపులు ఎదుర్కొంటున్నారు.

చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమకు జరిగిన వేధింపుల గురించి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పడం లేదు. ఎందుకంటే ఎవరూ నమ్మరు కాబట్టి. అమ్మాయిలు చెబితే నమ్ముతారేమో కానీ అబ్బాయిలు చెబితే ఎవరూ నమ్మరు. నిజానికి అమ్మాయిలకేకాదు, అబ్బాయిలకు కూడా వేధింపులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. చిన్నతనంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి అబ్బాయిలు చెబితే వారిని హేళన చేస్తారు. అమ్మాయిలు ధైర్యం చేసుకుని చెబితే వారిని తప్పుబడతారు. నీ దుస్తులు, లుక్‌ అలా ఉన్నాయి కాబట్టే వేధించారు అంటూ బాధిత మహిళను మరో మహిళ అనడం చాలా బాధాకరం. బాధితురాలితో ఎలా ఉండాలనే విషయంలో మహిళకు శిక్షణ అవసరం.

చదువు ఆపేస్తారేమో, ఉద్యోగం వద్దని ఇంట్లోనే ఉండమంటారేమో అనే సందేహంతో కొంత మంది అమ్మాయిలు వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడుతున్నారు. దయచేసి బాధితులను వారి పర్సనల్ విషయాల్లో హేళన చేయడం ఆపండి. చాలా మంది అబ్బాయిలు కూడా వేధింపులకు గురవుతున్నారు. వీరందరికీ మద్దతు కావాలని అర్థం చేసుకోండి. హేళన చేయకండి. ధన్యవాదాలు అని ఆమె పోస్ట్ చేశారు….

  •  
  •  
  •  
  •  

Comments