శ్రీరెడ్డి, పవన్ వివాదం పై వర్మ ఏమన్నారంటే ?

Wednesday, April 18th, 2018, 07:14:21 PM IST


నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, మరీ ముఖ్యంగా అవకాశాల కోసం వచ్చే తెలుగు అమ్మాయిలకు ఈ విధమైన వేధింపులు ఎదురవుతున్నాయి అని ఆమె అంటోంది. అయితే గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో ఈ వివాదం పెను సంచలనాలకు తెర తీస్తోంది. ఈ నేపథ్యంలో మొన్న పవన్ శ్రీరెడ్డికి తన మద్దతు ఉంటుందని కాకపోతే తన మద్దతు వల్ల ఆమెకు పెద్దగా ఉపయోగం ఉండదని, అలానే టివి చానెల్స్ లో డిబేట్ లలో కూర్చోకుండా పోలీస్ లకు కంప్లైంట్ చేయడం, కోర్ట్ లను ఆశ్రయించడం ద్వారా న్యాయం జరుగుతుందని అన్నారు.

అయితే ఈ విషయమై నిన్న శ్రీరెడ్డి పవన్ ను అన్న అనుకుని మీరు మాకు న్యాయం చేస్తారు అనుకుంటే, అందరిలాగే పోలీస్, కోర్టు అంటున్నారు అంటూ పవన్ పై, ఆమె తల్లిపై అసభ్య పదజాలంతో దూషించింది. అంతే కాదు ఆయన్ని అన్న అన్నందుకు తాను చెప్పుతో కొట్టుకుంది. అయితే ఆ తరువాత పలువురు పవన్ అభిమానులు ఆమె చేసిన వ్యాఖ్యాల పై విరుచుకుపడుతున్నారు. అలానే మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్ లు పవన్కు మద్దతుగా ట్వీట్ లు కూడా చేశారు. కాగా నేడు చివరికి ఆమె పవన్ కు ఆయన తల్లికి క్షమాపణ చెప్పింది. ఈ విషయమై నేడు వర్మ ఒక వీడియో విడుదల చేస్తూ, శ్రీరెడ్డి పవన్ ను అన్న ఆ బూతుమాట ఆయన తల్లిని ఉద్దేశించి కాదని, పవన్ అభిమానులు ఈ విషయమై ఆమెపై ఆగ్రహించవలసిన అవసరం లేదన్నారు.

అంతే కాదు ఇప్పటికే మరుగున పది వున్న కాస్టింగ్ కౌచ్ భూతాన్ని శ్రీరెడ్డి జాతీయ స్థాయిలో ముందుకు తీసుకువచ్చిందని, అయినా ఒకరకంగా ఇలా వ్యక్తిగత దూషణలు చేసి తాను అనుకున్న సిద్ధాంతాన్ని పక్కదాయరీ పట్టించకూడని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ ను అంత నీచ పదజాలంతో దూషించిన శ్రీరెడ్డి కి మద్దతుగా వర్మ మాట్లాడం పై కొందరు నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments