ఆ సినిమాకు కావాలనే లీకులు అందిస్తున్నారా ?

Saturday, May 12th, 2018, 11:25:32 AM IST

ఈ మధ్య స్టార్ హీరోల సినిమా షూటింగ్ లకు సంబందించిన ఫోటోలు, వీడియోస్, టైటిల్స్ వంటివి లీక్ అవుతూ టీమ్ ను నానా టెన్షన్ పెడుతున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలకైతే దాదాపు మొదటి భాగమో.. లేక మెయిన్ సినిమా లీక్ అయినా సందర్భాలు ఉన్నాయి. ఇక టైటిల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రకరకాల టైటిల్స్ తెగ ప్రచారంలో ఉంటాయి. అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పై ప్రస్తుతం క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను సంబందించిన ఫోటోలు, టైటిల్స్ తెగ ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా అసామాన్యుడు అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈ లీకుల వెనక త్రివిక్రమ్ అండ్ టీమ్ ఉందని టాక్ ? ఎందుకంటే అయన తన ప్రతి సినిమా షూటింగ్ సమయంలో ఒకటి రెండు టైటిల్స్ ని లీక్ చేస్తారు అందులో బాగున్నా టైటిల్ తెగ ప్రచారం పొందడంతో అదే టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు. లేటెస్ట్ గా పవన్ అజ్ఞాతవాసి కి అదే జరిగింది. త్రివిక్రమ్ ప్రతి సినిమాకు ఇలాగె హింట్ ఇస్తాడని అంటున్నారు. మరి టైటిల్ బాగుంటేనే కదా సినిమాకు క్రేజ్ వస్తుంది ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ మరి.ఎంతైనా త్రివిక్రమ్ బుర్రే బుర్ర. అందుకే ఎన్టీఆర్ కోసం అసామాన్యుడు అనే టైటిల్ హింట్ ఇచ్చాడు. అది బాగుందంటే మరికొందరు బాగాలేదని అంటున్నారు.. చూద్దాం ఏమి జరుగుతుందో.

Comments