నానితో ఆ దర్శకుడి సినిమా ఇక లేనట్టే ?

Wednesday, March 14th, 2018, 10:45:54 AM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఓ క్రేజీ దర్శకుడితో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు. ఈ మద్యే కథా చర్చలు అయితే జరిగాయి. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో తెలుసా .. ఇష్క, మనం, 24 లాంటి క్రేజీ సినిమాలతో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న విక్రమ్ కుమార్. అయితే ఈ దర్శకుడు కథ వినిపించాడట కానీ కథ విషయంలో సెకండ్ హాఫ్ నచ్చలేదని చెప్పడంతో సదరు దర్శకుడు అది మార్చడం కుదరదని చెప్పాడట. దాంతో నాని నో చెప్పినట్టు తెలుస్తోది. అదే కథను వేరే హీరోతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట దర్శకుడు. ఇప్పటికే ఆయన హిందీలో అక్షయ్ కుమార్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. మరి విక్రమ్ కుమార్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడంటే ఇక నానితో సినిమా చేయడానికి స్కోప్ లేనట్టే . ఇప్పటికే మరో రెండు వేరే ప్రాజెక్ట్స్ తో నాని బిజీగా అందడంతో విక్రమ్ కుమార్ తో నాని సినిమా ఉండక పోవొచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.