ఇప్పటికి కూడా కొందరిలో నిరాశ – అసలు తెరాస లో ఏం జరుగుతుంది…?

Monday, September 9th, 2019, 11:54:54 PM IST

తెలంగాణాలో తాజాగా మంత్రి వర్గ విస్తరణ పూర్తిగా జరిగింది. మొదటగా చేసిన మంత్రి వర్గ విస్తరణ ఫలితంగా చాలా విమర్శలు ఎదుర్కున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇపుడు ప్రస్తుతానికి రెండవసారి జరిపినటువంటి మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తన క్యాబినెట్ లో మహిళలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించారు కెసిఆర్. అంతేకాకుండా తన మంత్రి వర్గంలో ఒక ఎస్టీ మహిళకు మంత్రి పదవి ఇవ్వడంతో చాలా మంది కెసిఆర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇన్ని రోజులు కూడా పోటీలో చాలా కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు ని కూడా ఈసారి తన మంత్రి వర్గంలోకి తీసుకోని చాలా కీలకమైన బాధ్యతను అప్పగించారు కెసిఆర్. కానీ తెలనగానలో జరిగినటువంటి ఎన్నికల్లో తెరాస పార్టీ అత్యంతమైన విజయాన్ని నమోదు చేసుకున్న తరువాత తమకే మంత్రి పదవులు వస్తాయని చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిలో చాలామంది నిరాశలో ఉన్నారని సమాచారం.

అయితే అగాథంలో కేటీఆర్ తనయుడు ఒక ఐటీ శాఖా కి మంత్రి గా ఉన్నప్పటికీ కూడా అన్ని మంత్రి శాఖల్లోనూ కలగజేసుకునేవారని, హోంశాఖ మొత్తం తన కనుసన్నల్లో నడిపించేవారని అంటున్నారు. అంతేకాకుండా కేటీఆర్ మాట చెప్పకపోతే అసలు ఎలాంటి పని కూడా జరగదనే రేంజ్ లో అప్పటి పరిస్థితి ఉండేదని అందరు కూడా చెబుతున్నారు. ఇకపోతే ఇన్నిరోజులు కూడా పార్టీ కి పరిమితం అయిన కేటీఆర్ ఇపుడు మంత్రి వర్గంలో స్తానం సంపాదించుకోవడంతో మల్లి తలనొప్పి ప్రారంభం అయిందని పలువురు మంత్రులు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం. కానీ ఇప్పటికి కూడా పార్టీ అధిష్టానం వలన చాల మంది అసంతృప్తిగా ఉన్న నేతలు చాలా మంది ఉన్నారని, ఇప్పటికి కూడా పార్టీ చీలిపోతుందని అందాలు కూడా అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.