ఏంటి .. గోవాభామ తల్లి కాబోతుందా ?

Tuesday, April 17th, 2018, 02:25:31 PM IST

సౌత్ లో ఓ రేంజ్ గ్లామర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఇలియానా బాలీవుడ్ లో క్రేజీ తెచ్చుకోవాలని ఇక్కడ అవకాశాలు వదిలేసి బాలీవుడ్ కి చెక్కేసింది. బాలీవుడ్ లో చేసిన రెండు మూడు సినిమాలు కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. దాంతో ప్రేమాయణం మొదలు పెట్టడమే కాకుండా ప్రియుడితో కలిసి తెగ షికార్లు చేసింది. ఈ విషయం బయటికి రావడంతో ఈ విషయం పై బయట పడింది. తన ప్రియుడు అండ్రు నీబోన్ తో డేటింగ్ కూడా చేసింది. తనకు ఆండ్రు దేవుడిచ్చిన బెటర్ హాఫ్ అని చెప్పుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే వార్త బి టౌన్ మీడియా లో వైరల్ అయింది. ఎక్కడ చుసిన ఇలియానా ప్రెగ్నెంట్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిజం ఎంత ఉందన్నది తేలాల్సి ఉంది. ఇలియానా కూడా ఈ మధ్య బయట పెద్దగా కనిపించడం లేదు .. దాంతో ఇలా వార్తలు వస్తున్నాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments