జనసేనాని మదిలో ఏముంది..?

Sunday, June 2nd, 2019, 10:14:36 PM IST

తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అనే సామెత ఇప్పుడు పవన్ కు వర్తిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎన్నికల ఫలితాల ముందు రోజు వరకు అసలు పవన్ ప్రభావం ఎలా ఉండబోతుందో చూడండి అంటూ జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేసారు.కానీ సీన్ కట్ చేస్తే ఊహించని ఫలితాలు చూడాల్సి వచ్చింది.కారణాలు ఏవైతేనేం పోటీ చేసిన రెండు చోట్ల నుంచి పవన్ ఓటమి పాలయ్యారు.అస్సలు ఓటమి అనేదే ఉండదు అనుకున్న మాజీ జేడీ వివి లక్ష్మి నారాయణ కూడా విశాఖ ఎంపీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు.దీనితో జనసేన శ్రేణులకు ఏమీ అర్ధం కాలేదు.కారణాలు ఎన్ని వెతుక్కున్నా సరే జరిగిపోయింది కాబట్టి ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు.

నిజానికి యువతలో అత్యధిక శాతం సినిమా రంగం నుంచి రాజకీయాలు అంటే ఆసక్తి కనబర్చేలా చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది పవనే అని చెప్పాలి.అలాంటి పవన్ ఇప్పుడు మౌనం వ్యక్తం చేస్తున్నారు.తన ఓటమిని పార్టీ ఓటమిని హుందాగా ఒప్పుకున్నారు కానీ ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు దీనితో అసలు పవన్ ఏం చేస్తున్నారు ఏం చెయ్యబోతున్నారు అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.భవిష్యత్ ప్రణాళికలు ఏమన్నా పవన్ రచిస్తున్నారా? అలాగే క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతంగా చేసేందుకు వ్యూహాలు వేస్తున్నారా? అన్న అనేక ప్రశ్నలు జనసేన శ్రేణుల్లో మెదులుతున్నాయి.మరి పవన్ అసలు ఏమనుకుంటున్నారో ఆయన మదిలో ఏముందో తెలియాలంటే ఆయన బయటకొచ్చి మాట్లాడక తప్పదు.