పాపం ఇక చంద్రబాబు భవిష్యత్తు ఏంటో మరీ….

Wednesday, June 5th, 2019, 12:39:40 AM IST

గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన చంద్రబాబు నాయుడు, ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో గోరమైన పరాజయం పాలయ్యాడు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయారు… ఎంతో పట్టున్న రాయలసీమలో కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు… దానికి తోడు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచినా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా విజయం సాధించలేకపోయారు… అంతేకాకుండా సొంత జిల్లాలో కూడా కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు చంద్రబాబు… అంతేకాకుండా కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ పూర్తిగా చతికిలపడిపోయిందని చెప్పాలి… ప్రస్తుతానికి చంద్రబాబు పరిస్థితి పరిస్థితి ఏంటి అని అటు పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని అంచనా… 2024 లో రానున్న ఎన్నికల్లోనైనా చంద్రబాబు పుంజుకుంటాడా లేక ఇలాగె కొనసాగిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే అప్పటికి చంద్రబాబు వయసు కూడా పెరిగిపోతుంది. ఆ వయసులో చంద్రబాబు పార్టీని ఎలా నడిపిస్తాడో అని ఇప్పటినుండే లోకేష్ కి బాధ్యతలు అప్పగించాలని చూసినప్పటికీ కూడా, లోకేష్ మాత్రం ఆ హోదాని అందుకునే పరిస్థితి లేదనే చెప్పాలి… ఒకవేళ పార్టీ పగ్గాలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్తే మాత్రం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని రాజకీయ వర్గాల సమాచారం.