ఎదో చేయాలనీ ఆలోచింది, చివరికి పరువు పోగొట్టుకున్నారుగా…?

Sunday, August 18th, 2019, 02:15:29 AM IST

ఏపీలో జరిగిన ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న టీడీపీ పార్టీ, ఆతరువాత పార్టీ బలోపేతానికని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు… కానీ ప్రజల్లో మళ్ళీ నమ్మకాన్ని సంపాదించేందుకు వేస్తున్న అడుగులన్నీ కూడా కొంత వరకు వారిని నవ్వులపాలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్న కాస్తంత పరువు కూడా పోగొట్టుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు మరియు అతని కుమారుడు నారా లోకేష్. ఇకపోతే ట్విట్టర్ ద్వారా జగన్ పై పలు విమర్శలు చేస్తూ ఒకరకమైన నెగిటివిటీని సంపాదిద్దామని ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఏపీలో పలు చోట్ల నాదీ ప్రవాహాల వరదలు తీవ్రతరమైన స్థాయికి చేరుకుంది.

అయితే ఆ వరద ఉదృతిని అంచనా వేయడానికి వైసీపీ నాయకులు కొందరు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారని సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ డ్రోన్ లను రాజకీయం చేయాలనీ చూసినప్పటికీ కూడా అది కూడా చాలా అదారుణంగా బెడిసికొట్టింది. అసలు ఈ వరదాలకుక్ సంబంధించి ఎదో రభస చేయాలనీ టీడీపీ నేతలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు వారికే బెడిసికొట్టాయి… చివరికి వారికి పరువు పోయినంత పని అయిందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఎలాగైనా జగన్ ప్రభుత్వం మీద ప్రజలకు అసమ్మతిని కలిగించాలని ప్రయత్నాలు చేశారు కానీ చివరికి వీరే నవ్వుల పాలవడం అనేది దారుణం అని అంటున్నారు.