చంద్రబాబు పరిస్థితి ఏంటి మరీ ఇంత దారుణంగా తయారయింది…?

Thursday, December 12th, 2019, 02:49:45 AM IST

టీడీపీ అధినేత చందబ్రాబు గారికి రాజకీయ పరంగా కనీసం 40 ఏళ్ళ అనుభవం ఉందని మనందరికీ తెలుసు. కాగా ఇదే విషయాన్నీ చంద్రబాబు నిత్యం గుర్తు చేసుకుంటాడు… దానికి తోడు ఒకానొక సమయంలో జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకవైపు ఆయనకు వయసు పెరిగిపోతుంది. కానీ ఇదే సమయంలో ఆయనపై ప్రతి ఒక్క నాయకుడు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. చివరికి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొందరు నేతలు కూడా చంద్రబాబు ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు పై అధికార పార్టీ నేతలందరూ కూడా చంద్రబాబు ని విమర్శించినవారే… ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, అధికార పక్షానికి చుక్కలు చూపించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడెందుకు ఇలా ఉన్నారో ఎవ్వరికి అర్థం కావడం లేదని చెప్పాలి. అయితే చంద్రబాబు ఇంతలా సైలెంట్ గా ఉండటం పై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు వేసే ఎత్తులన్నీ కూడా ఎవరికీ అందని విధంగా ఉంటాయని అందరికి తెలిసిన విషయమే… కాగా చంద్రబాబు మౌనం వెనకాల మరేదైన పైఎత్తులు ఉన్నాయా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి…