సొంత పార్టీనేతల్లోనే చంద్రబాబు పరిస్థితి ఇలా తయారయ్యిందా…?

Thursday, June 13th, 2019, 02:46:24 AM IST

రాజకీయాలు అన్నాక అందులో గెలుపోటములు సహజం… ఒకరి గెలిచారంటే, మరొకరు ఓటమి పాలవ్వడం అనేది చాలా సహజం. ఇదంతా మామూలే కానీ కొందరు నేతలు మాత్రం వీటన్నింటిని చాలా సీరియస్ గా తీసుకోని పగలు ప్రతీకారాలు పెంచుకొని తప్పులు చేస్తుంటారు. కాగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణంగా ఓడిపోయినా సంగతి మనకు తెలిసిందే… ఆ ఓటమి అనేది టీడీపీ ని చాలా వరకు కుంగదీసింది. అంత దారుణంగా ఓడిపోయింది కాబట్టి టీడీపీ పార్టీ ప్రస్తుతానికి అందరికి లోకువ అయిందని తెలుస్తుంది. కాగా ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలే సాక్షాత్తు అధినేత చెప్పిన విషయాలను పట్టించుకోకుండా, పెడచెవిన పెట్టి, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అందులో ముఖ్యులు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు. ఎందుకంటే, వీళ్ళు పార్టీలో సీనియర్ నేతలు రేపోమాపో పార్టీలో కీలక పదవులు అందుకోబోతున్న వ్యక్తులు. అలంటి వారు కూడా చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఉంటె ఎలా అని అంటున్నారు రాజకీయవేత్తలు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు… కరణం బలరాం రెండో వ్యక్తి పయ్యావుల కేశవ్. ఈ ఇద్దరు పార్టీ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి, నేతలు దృష్టిని ఆకర్షించడం మొదలు పెట్టారు. ఒకరకంగా చూస్తే వీరు టీడీపీ ని మోసం చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ విషయం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి…