ఆర్టీసీ సమ్మె విషయంలో కెసిఆర్ ని చూసి పవన్ వెనక్కి తగ్గుతున్నాడా…?

Tuesday, October 15th, 2019, 03:00:05 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉగ్రరూపం దాల్చనుంది. తెలంగాణ సర్కారు ప్రవర్తనపై విసిగిపోయిన వీరు ఆత్మహత్య చేసుకోడానికి కూడా వెనకాడకుండా తమ ప్రాణాలను వదులుతున్నారు. అయితే ఈ సమ్మెకు మద్దతుగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సరైనవే అయినప్పటికీ కూడా కెసిఆర్ ఎందుకిలా చేస్తున్నాడో అర్థమవడం లేదు.

అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జెఏసి ఈ నెల 19 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు. వారికి పూర్తిగా మద్దతు ప్రకటించారు పవన్. కానీ అవి మాటల వరకే ఆగిపోయాయి. చేతల్లో కనిపించడం లేదు. ఆత్మహత్య చేసుకున్న వారిని పరామర్శించడమో లేక కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో పవన్ తెలంగాణాలో కూడా పోటీ చేయడానికి సిద్ధం అని చాలా సార్లు ప్రకటించారు. ఒకవేళ ఆ సమయంలో కెసిఆర్ అడ్డు పడతారా అనే భయంతో పవన్ వెనకడుగు వేస్తున్నారా, లేక పవన్ తో శత్రుత్వం ఎందుకని పవన్ వెనక్కి తగ్గారా అనేది తెలియాల్సి ఉంది.