“అజ్ఞ్యాతవాసి” ప్లాప్ డిస్ట్రిబ్యూటర్ పేరు మార్చింది అందుకేనా.?

Saturday, October 6th, 2018, 02:34:53 PM IST

ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి ఘోర పరాజయం చవి చూసిన చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “అజ్ఞ్యాతవాసి” చిత్రం కూడా ఒకటి అప్పటికే త్రివిక్రంతో రెండు చిత్రాలు చేసి ఒక సూపర్ హిట్,ఒక ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ చిత్రం కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ కూడా చేసింది.అదే విధంగా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని ఎల్ ఏ తెలుగు(LA Telugu) అనే సంస్థ వారు భారీ మొత్తంలోనే కొని దారుణంగా నష్టపోయారు.

ఆ తరువాత ఓవర్సీస్ మార్కెట్ లో తీసుకున్న ఒక్క చిత్రం కూడా వీరికి మంచి లాభాలని అందించిన పాపాన పోలేదు.”అజ్ఞ్యాతవాసి తర్వాత నా నువ్వే,చి.ల.సౌ, మరియు నాగ చైత్యన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు” చిత్రం కూడా ఎల్ ఏ తెలుగు(LA Telugu) అనే పేరుతోనే విడుదల చేశారు కానీ, ఊహించిన లాభాలను అందించలేదు.దీనితో వారికి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు అని అనిపించిందేమో ఈ సారి తీసుకున్న “అరవింద సమేత” చిత్రానికి వారి సంస్థ యొక్క పేరుని మార్చేశారు.ఎల్ ఏ తెలుగు అనే పేరుని తీసేసి ఇప్పుడు “వైనవి హాన్వి క్రియేషన్స్” అనే పేరు పెట్టుకున్నారు.ఇప్పుడు ఈ పేరుతోనే ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు.ఈ సారైనా వారి అదృష్టం మారుతుందో లేదో చూద్దాం.