రంగంలోకి దిగిన కెసిఆర్ – అందరిని బుజ్జగిస్తారా…?

Tuesday, September 10th, 2019, 07:50:30 PM IST

తెలంగాణాలో ఎట్టకేలకు పూర్తిస్థాయి మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కానీ ఇప్పుడు అదే కెసిఆర్ కి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా తమకి మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు ప్రేట్టుకున్న కొందరికి మాత్రం తీవ్రమైన నిరాశ మిగిలిందని చెప్పాలి… ప్రస్తుతానికి వారందరు కూడా అసంతృప్తి సమాచారం. వారెవరంటే…నాయినీ నరసింహ్మారెడ్డి, జోగురామన్న, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరికొందరు నేతలు కూడా తెలంగాణ కాబినెట్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు వారందరిని కూడా బుజ్జగించేందుకు తెరాస పార్టీ అధిష్టానం రంగం సిద్ధం చేసుకుందని చెప్పాలి.

మంత్రి పదవులు దక్కలేదని నైరాశ్యంలో కూరుకుపోయిన కొందరు నేతలకు తెలంగాణ భవన్ నుండి కొత్త వార్తలు వెళ్తున్నాయని సమాచారం. మరికొద్ది రోజుల్లో వారందరికీ కూడా ఎంతో గౌరవప్రదమైన పదవులు అప్పగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెబుతున్నారు. దానికితోడు ఈ సారి దీనితోనే సరిపెట్టుకోవాలని కెసిఆర్ వారికి సూచించారని సమాచారం. కానీ ఆ పదవులు స్వీకరించేందుకు తాము సిద్ధంగా లేమని మాజోయ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి బహిరంగంగానే వెల్లడించారు. అయితే కెసిఆర్ చేసిన వాఖ్యలు విన్నటువంటి కొందరు అసంత్రుప్తి నేతలు మాత్రం దిగివస్తున్నారు. కాగా కెసిఆర్ మాకు దేవుడు అని మళ్ళీ తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా అవన్నీ కూడా గిట్టని వారు వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అవన్నీ నమ్మొద్దని అసంతృప్తి నేతలు ప్రచారం చేస్తున్నారు.