జగన్ కి తెలుగు తమ్ముళ్లు అడ్డు పడుతున్నారా…?

Tuesday, June 25th, 2019, 02:30:10 AM IST

గత ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీడీపీ దారుణమైన ఓటమిని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసింది. అయితే గతంలో చంద్రబాబు హయాంలో, తానూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అన్ని సంవత్సరాలలో రాష్ట్రము ఎంతలా అభివృద్ధి చెందిందో మనకు తెలిసిందే. అయితే ఏపీకి కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏపీలో అడుగడుగునా పాదయాత్రలు చేసి, ప్రజల యొక్క కష్టాలను దగ్గరినుండి చూసి, ఆ కష్ఠాలను అర్థం చేసుకొని మరీ అధికారంలోకి వచ్చిన వారు జగన్, అందుకే జగన్ ప్రజలందరికి మంచి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుసు. కానీ జగన్ ఈ పనులన్నీ చేయడానికి అందరు సహకరిస్తారా లేక అడ్డుపడేవారెవరైనా ఉన్నారా… ఈ ప్రశ్నకు సమాధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుపడతారని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు…

ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అసలే తేలేడు… అయితే ఈ వాఖ్యలు అన్ని కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం అసలే అనడం లేదు. ఏపీలో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. అంతేకాకుండా విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దే రామ్మోహనరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వీళ్ళంతా హోదా రాదని ముందే చెప్పేస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారని కేశినేని నాని, ఏపీ సీఎం జగన్ ని డిమాండ్ చేస్తున్నారు. గంటా వంటి వారు హోదా జగన్ కూడా తేలేరని కచ్చితంగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇన్నిరోజులు కేంద్రంతో కొట్లాడిన టీడీపీ నేతలే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలా ఇస్తుంది అని పలువురు అంటున్నారు. అంటే ఈ ప్రభావం అంత కూడా ఏపీ ప్రజల మీదనే పడనుందని తెలుస్తుంది.