విజయశాంతి పై మళ్ళీకుట్ర – కారణం ఎవరు…?

Wednesday, August 21st, 2019, 11:39:25 PM IST

తెలంగాణాలో విజయశాంతి పరిస్థితి ఏంటో ప్రస్తుతానికి ఎవ్వరికి కూడా అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి విజయశాంతి, త్వరలో పార్టీ మారబోతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి… కానీ తాను ఏ పార్టీలో చేరబోతుందనేది మాత్రం ఎవరికీ కూడా తెలియదని చెప్పాలి… కాగా విజయశాంతి మాత్రం నిజంగానే పార్టీ మారుతున్నారా, లేక ఎవరైనా ఇలాంటి పుకార్లను కావాలనే సృష్టిస్తున్నారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పాలి… కాగా విజయశాంతి మీద కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ వార్తలపై అసలు విజయశాంతి ఏమంటున్నారు…? అనే వార్తలు చాలా వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి…

అయితే భారతీయజనతా పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి విజయశాంతి, ఇప్పటికి కూడా బీజేపీ పార్టీకి సంబందించిన సీనియర్ నేతలతో టచ్ లో ఉంటున్నారని సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని కలగంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి ఇతర పార్టీలో అసమ్మతి గా ఉన్నటువంటి నేతలతో సంప్రదింపులు జరిపి బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నారు. కాగా ఈమేరకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎక్కువ మొత్తంలో వలసలకు ప్లాన్ చేశారు బీజేపీ నేతలు. అందుకనే మళ్ళీ విజయశాంతి ని తిరిగి బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈమేరకు విజయశాంతి మళ్ళీ బీజేపీలోకి రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలకు బలాన్ని చేకూర్చాయి…

కానీ ఈ వార్తలపై స్పందించినటువంటి విజయశాంతి కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారు. కాగా తనపై వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అబద్దాలే అని. అలంటి అనవసరమైన పుకార్లను ఎవరో కావాలనే సృష్టిస్తున్నారని. ఎట్టి పరిస్థితిలోను తాను పార్టీ మారాబోనని విజయశాంతి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని విజయశాంతి అంటున్నారు.