కాస్టింగ్ కౌచ్ పై కొరటాల ఏమన్నారంటే?

Sunday, April 15th, 2018, 05:24:26 PM IST

ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్న కాస్టింగ్ కౌచ్ లో తన పేరు బయటకు రావడంపై ‘భరత్ అనే నేను’ దర్శకుడు కొరటాల శివ స్పందించారు. అయన నిన్న ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, కాస్టింగ్ కౌచ్ పై తాను మరోసారి మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా, చిత్రం ప్రమోషన్, విడుదల తదితరాలు తప్ప మరో ఆలోచన లేదని అన్నారు.

రామ్ చరణ్ తో తన తదుపరి చిత్రం కథ గురించి ఇప్పటివరకూ ఏమీ అనుకోలేదని, ఆయన ఇప్పుడు చేస్తున్న చిత్రాలు పూర్తయిన తరువాత తమ సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఎవరినీ ఉద్దేశించి తీయలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ కల్పిత కథగానే దీన్ని చూడాలని అన్నారు. ఎలాంటి వివాదాలూ రారాదనే ఉమ్మడి రాష్ట్రాన్ని చూపించామని చెప్పారు. ఈ సినిమాలో మహేష్ బాబు తన ప్రాణం పెట్టి నటించారని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments