శ్రీరెడ్డి వివాదంపై నాని భార్య ఏమన్నదంటే ?

Tuesday, June 12th, 2018, 05:42:47 PM IST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విషయమై తెలుగు అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని నటి శ్రీరెడ్డి అప్పట్లో పెద్ద వివాదానికి తెరలేపిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాక ఆ సమయంలో నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరాం ఫోటోలు బయటపెట్టిన శ్రీరెడ్డి, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని ని టార్గెట్ చేసి పలు విమర్శలు చేస్తున్న విషయం విదితమే. నాని ఇదివరకు తనను లైగికంగా వేధించాడని, తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడని ఆరోపించింది. అంతేకాక ఇటీవల తనకు బిగ్ బాస్-2 లో వచ్చిన అవకాశాన్ని నాని చెడగొట్టాడని ఆమె అంటోంది.

అయితే ఆమె చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించిన నాని ఆమెకు లీగల్ నోటీసు పంపిస్తున్నానని, ఆమె వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నిన్న సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక నేడు నాని భార్య అంజన కూడా శ్రీరెడ్డి పై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినీ పరిశ్రమ ఎంత గొప్పదో అందరికి తెలిసిందే, అయితే ఇక్కడ కొందరు మాత్రం ఇతరుల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరు నమ్మరు. ఇక ఇటుంవటి వారు పబ్లిసిటీ కోసం తమ వ్యక్తిగత జీవితాలను సైతం దిగజార్చుకోవడానికి సిద్దపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంజనా చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…..

  •  
  •  
  •  
  •  

Comments