పాపం…డీజే దర్శకుడికి అవకాశాలు కరువు ?

Friday, June 8th, 2018, 12:50:08 AM IST

భారీ అంచనాలతో అల్లు అర్జున్ తో తీసిన డీజే దువ్వాడ జగన్నాధం ప్లాప్ అవ్వడంతో పాపం దర్శకుడు హరీష్ శంకర్ కెరీర్ మీద తీవ్ర ప్రతాపం చూపించింది. ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానని ఆశపడ్డ ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాబట్టిన కమర్షియల్ గా మాత్రం పెద్ద విజయాన్ని అందుకోలేదు. ఇక ఈ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా కూడా హరీష్ శంకర్ ఇంతవరకు ఒక్క సినిమా ప్రకటించలేదు . ఇప్పటికే సాయి ధరమ్, శర్వానంద్ లాంటి హీరోలతో చర్చలు జరిపాడు కానీ ఏది వర్కవుట్ కాలేదు. ఈ మద్యే ఓ సినిమాకు కథా చర్చలు కూడా జరిగాయి.. ఆ సినిమా పక్కా అవుతుందని అనుకున్నారు .. కానీ ప్రస్తుతం ఆ సినిమా కూడా పోయింది. సో మొత్తానికి డీజే దర్శకుడి చేతిలో ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి మరి !!