ఈ క్రియేటివ్ డైరెక్టర్ మరో సినిమా చేస్తున్నాడా ?

Wednesday, June 6th, 2018, 10:09:01 PM IST

టాలీవుడ్ లో క్రియేటివ్ దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణవంశీ అంటే ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికి తెలుసు. గులాబీ, సిందూరం, నిన్నే పెళ్లాడతా, అంతఃపురం లాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీసాడు. ఆ తరువాత వరుస పరాజయాలతో ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. ఇక గత ఏడాది నక్షత్రం అంటూ ఓ సినిమా తీసాడు .. ఆ సినిమా భారీ పరాజయం పాలవడంతో కృష్ణవంశీకి కష్టాలు తప్పలేదు. ఆ సినిమా వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క సినిమా కూడా మొదలు పెట్టలేదు. ప్రస్తుతం ప్రయత్నాలైతే చేస్తున్నాడు కానీ .. ఆయనతో సినిమా చేసేందుకు ఏ హీరోకూడా సుముఖత చూపించడం లేదట. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ మరోసారి గట్టిగ ప్రయత్నాలు మొదలు పెట్టాడని .. ఈ సారి తనను నమ్మిన హీరోలు శ్రీకాంత్, రవితేజ లతో ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ ఇద్దరు హీరోలు డేట్స్ ఇవ్వొచ్చు కానీ సినిమా తీసేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తాడా ? అన్నది అసలు సమస్య. ఇక కృష్ణవంశీ సొంతంగా డబ్బులు పెట్టె పరిస్థితి లేదు .. ఇప్పటికే కొన్ని సినిమాల్లో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకున్నాడు. మరి అయన నెక్స్ట్ సినిమా ఏమిటో అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments