కాస్టింగ్ కౌచ్ పై రాఖి ఏమన్నదంటే?

Monday, April 30th, 2018, 04:42:57 PM IST

ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ విషయం టాలీవుడ్ ను కుదిపేస్తోంది. గాయత్రి గుప్తా, మాధవీలత, శ్రీ రెడ్డి సహా పలువురు వర్ధమాన నటీమణులు మాట్లాడుతూ సినిమా అవకాశాల కోసం వచ్చే తెలుగు అమ్మాయిలను కొందరు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, తమ కోరికలు తీరిస్తే కానీ అవకాశాలు ఇవ్వము అని బలవంతం చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పటికే పెద్ద దుమారం రేపేంది. అలానే ఈ విషయమై బాలీవుడ్ నటీమణులు కంగనా రనవత్, రాధికా ఆప్టే, ఇలియానా వంటి వారి కూడా సమర్ధించారు. తాజాగా ఈ విషయం పై బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట నిజమేనని, అయితే ఎవరు కూడా అమ్మాయిల పై కావాలని అత్యాచారం చేయరని, వారి పరస్పర ఇష్టం తోనే అది జరుగుతోందని అంటోంది. అంతే కాదు ఇప్పటి అమ్మాయిలు మమ్మల్ని ఏవిధంగా అయినా మమ్మల్ని ఉపయోగించుకోండి, కానీ అవకాశాలు మాత్రం ఇవ్వండి అనేలా వున్నారని అన్నది. కాగా ఇటీవలి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను తాను ఒప్పుకుంటున్నట్లు తెలిపింది. అయితే బాలీవుడ్ ను అగౌరవ పరచడం తన ఉద్దేశం కాదని అంటోంది. తాను కూడా తొలి నాళ్లలో ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు చెప్పింది ఈ భామ, పోను పోను మంచి అవకాశాలు దక్కించుకున్నాక ఇటువంటివి ఉండవని, కొందరు తమ కళ్ళముందే లైంగిక వేధింపులు జరుగుతున్నా, బయట ప్రపంచానికి మాత్రం వెల్లడించరని,

ఆ విషయంలో సరోజ్ ఖాన్ నిర్భయంగా మాట్లాడారని అంటోంది. అయితే ఈ రంగుల ఇండస్ట్రీ లో ఈ విధమైన వేధింపులకు యువకులు కూడా ఏమాత్రం మినహాయింపుకాదని వెల్లడించింది. విజయానికి ఎటువంటి షార్ట్ కట్ లు ఉండవని, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటివారు ఎంతో కష్టపడి, ఎన్నో సమస్యలను అధిగమించి పైకి వచ్చారని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ భామ హిత బోధలు చేస్తోంది. అయితే చివరిగా మాత్రం ఎప్పుడు ఎవరితోనూ రాజీపడకండి, కష్టపడండి, సమస్యలను ఎదుర్కొండి, అవకాశలకోసం ఒత్తిళ్లకు లొంగకండి అని చెప్పడం విశేషం……

  •  
  •  
  •  
  •  

Comments