మ‌హేష్ -తార‌క్‌-చ‌ర‌ణ్ ర‌హ‌స్య మంత‌నాలు?

Wednesday, April 25th, 2018, 09:40:23 PM IST

“మేం బాగానే ఉంటాం.. మీరు జాగ్ర‌త్త‌!“ అని హెచ్చ‌రించారు తార‌క్‌. `భ‌ర‌త్ అనే నేను` ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మ‌హేష్ అన్న‌య్య గురించి చెబుతూ తార‌క్ త‌మ్ముడు చేసిన ఆ కామెంట్ అభిమానుల్లోకి సూటిగా దూసుకెళ్లింది. అన‌వ‌స‌రంగా మేం మేం కొట్టుకుంటాం కానీ, వాళ్లంతా ఒక్క‌టే! అన్న సంగ‌తి అభిమాన దేవుళ్లు అంద‌రికీ అర్థ‌మైంది. ఇండ‌స్ట్రీలో ఇప్పుడున్న అర‌డ‌జ‌ను స్టార్ హీరోలు ఒక‌రికొక‌రు బ్ర‌ద‌ర్స్‌లా క‌లిసిమెలిసి ఉంటార‌న్న‌ది అభిమానుల‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. రిలీజ్‌ల వేళ బాక్సాఫీస్ రికార్డుల విష‌యంలో మీవాడు-మావాడు అంటూ స‌ప‌రేట్ చేస్తూ మాట్లాడుతారు. సామాజిక మాధ్య‌మాల్లో ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకుంటారు. కాస్త అప్పుడ‌ప్పుడు డోస్ పెంచుతూ బూతులు తిట్టుకుంటారు ఫ్యాన్స్‌. అయితే అవేవీ ఇప్పుడు అవ‌స‌రం లేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. స‌మాజిక మాధ్య‌మాల సాక్షిగా సాగుతున్న ఆ ర‌చ్చంతా కేవ‌లం అభిమానుల ఆక‌తాయి ప‌నులుగానే భావించాల్సొస్తోంది.

ఇదిగో ఇక్క‌డ ఈ ఫోటో చూస్తేనే ఆ సంగ‌తిని అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లే `భ‌ర‌త్ అనే నేను` ప్రీరిలీజ్ ఈవెంట్ అనంత‌రం ఇచ్చిన పార్టీలో మ‌హేష్ తో పాటు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఓ రేంజులో చిలౌట్ చేశారు. ఆ క్ర‌మంలోనే కొన్ని ఫోటోలు రిలీజ‌య్యాయి. మొన్న స‌క్సెస్‌మీట్ త‌ర‌వాత కూడా `పార్క్ హ‌య‌త్‌`లో ఓ ఘ‌న‌మైన పార్టీ జ‌రిగింది. ఈ పార్టీలోనూ భ‌ర‌త్ అనే నేను పంపిణీదారుల‌తో పాటు, ప‌లువురు ప్ర‌ముఖులు ఎటెండ్ అయ్యారు. అందులో తార‌క్‌, చెర్రీ ఉన్నార‌ని తెలుస్తోంది. మెగా ప‌వ‌ర్‌స్టార్‌-యంగ్ టైగ‌ర్‌- సూప‌ర్‌స్టార్ ఒకేచోట‌.. అంటూ క్యాప్ష‌న్‌తో ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. పైగా దీనిని మ‌హేష్ భార్యామ‌ణి న‌మ్ర‌త స్వ‌యంగా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేయ‌డంతో అటు ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో, ఇటు మెగా, నంద‌మూరి అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూడ‌గానే మ‌హేష్‌-తార‌క్‌-చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ఏమైనా తెర‌కెక్క‌నుందా? అంటూ అభిమానులు స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే అంత‌కంటే సంతోషం ఇంకేం ఉంటుంది?

  •  
  •  
  •  
  •  

Comments