సామ్రాట్ తో ఎఫైర్ వార్తలపై తేజస్వి స్పందన ఏంటంటే?

Tuesday, July 24th, 2018, 09:28:42 PM IST


బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ మన తెలుగు వారున్నారో, ఆయా చోట్ల కూడా మంచి క్రేజ్ సంపాదించినట్లు విశ్లేషకులు చెపుతున్నారు. అనూహ్యంగా ఈ సీజన్ కి రేటింగ్ కూడా రోజురోజుకు పెరుగుతోందని వారు అంటున్నారు. ఇక ఇప్పటివరకు ఈ షో లో మొత్తం ఎలిమినేట్ కాబడ్డ ఆరుగురిలో ఒకరిని తిరిగి షోలోకి తిరిగి వచ్చేలా ఆన్ లైన్ వోటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఇప్పటికే హోస్ట్ నాని ప్రకటించారు. కాగా గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తేజస్విని, తనను అనవసరంగా తప్పుగా అర్ధం చేసుకున్నారని, షో లో మొత్తం 24 గంటలు ఉంటే, కేవలం ఒక గంట నేను అరిచి గోలచేసినవి మాత్రమే చూపారని ఆవేదన వ్యక్తం చేసారు. మిగిలిన గంటల్లో తాను ఎంతో కూల్ గా, సరదాగా వున్నానని,

అవి మాత్రం ప్రసారం చేయలేదని వాపోతోంది. అయితే గత కొద్దికాలంగా తనకు మరియు సహచర పార్టిసిపెంట్ సామ్రాట్ కు మధ్య ఏదో ఎఫైర్ నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తన ఫేస్ బుక్ ద్వారా స్పందించిన తేజస్విని, నిజానికి తనకు, సామ్రాట్ కు మధ్య ఏమి లేదని, అతను చాలా మంచి మనిషని చెప్తోంది. అంతే కాదు తనీష్ కూడా చాలా మంచివాడని, మంచి మనుషులందరూ కలిస్తే మంచి ఫ్రెండ్స్ గా ఒక టీం గా ఉండొచ్చని, ఆదే తాము చేసినట్లు చెప్తోంది ఈ భామ. అయితే ఇక ప్రస్తుతం జరగనున్న ఆన్ లైన్ వోటింగ్ లో తనకు ఓట్లు వేసి తిరిగి షోలోకి ప్రవేశించేలా ప్రేక్షకుల మద్దతు ఆశిస్తున్నట్లు చెపుతోంది. మరి ఆమె ఆశ ఏ మేరకు తీరుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే….

  •  
  •  
  •  
  •  

Comments